Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Alia Bhatt :కేన్స్‌లో అలియాను పట్టించుకోలేదా..?

Alia Bhatt :కేన్స్‌లో అలియాను పట్టించుకోలేదా..?

NTV Telugu 1 week ago

లియా భట్ కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న సమయంలో అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్లు ఆమెను పెద్దగా పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, కట్టుకథలు వైరల్ అయ్యాయి.

దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. 'అయ్యో పాపం.. మిమ్మల్ని అక్కడ ఎవరూ గుర్తించలేదు' అని వెటకారంగా కామెంట్ పెట్టాడు. ఈ నెగెటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా అలియా భట్ తన స్టైల్‌లో సమాధానమిస్తూ.. ''అయ్యో పాపం అనే మాట ఎందుకులెండి.. అక్కడ వారు గుర్తించకపోతేనేం, ఇక్కడ మీరు నన్ను గుర్తించారు కదా..!'' అంటూ పంచ్ డైలాగ్‌తో రిప్లై ఇచ్చారు. ఈ అదిరిపోయే రిప్లై చూసిన అలియా అభిమానులు “ట్రోలర్స్‌కు ఎలా బుద్ధి చెప్పాలో మీకు బాగా తెలుసు” అంటూ ఆమె ముక్కుసూటితనాన్ని, సమయస్ఫూర్తిని నెట్టింట తెగ పొగిడేస్తున్నారు.

ఇదే కేన్స్ వేడుకల్లో మరో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా తన లుక్‌తో ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. కేన్స్ చరిత్రలోనే అత్యంత విలువైనదిగా భావిస్తున్న ఒక అద్భుతమైన క్రిస్టల్ గౌనును ధరించి ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఫ్యాషన్ నిపుణుల సమాచారం ప్రకారం.. ఊర్వశి ధరించిన ఈ ప్రత్యేకమైన క్రిస్టల్ గౌను ధర దాదాపు రూ. 1,491 కోట్లు ఉంటుందని టాక్. దీంతో ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో అలియా కౌంటర్ మరియు ఊర్వశి కాస్ట్‌లీ లుక్ గట్టిగా ట్రెండ్ అవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu