Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

NTV Telugu 2 hrs ago

Alluri District Blast: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట సమీపంలోని మైనింగ్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో మొదట నలుగురు ప్రాణాలు విడిచినా.. ఆ తర్వాత మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు సమాచారం. మృతుల్లో ఓ ఉపాధ్యాయురాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో స్థానికంగా విషాదం నెలకొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న గుత్తేదారుకు చెందిన వాహనాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం నుంచి టిప్పర్‌లోకి డీజిల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.. పేలుడు ధాటికి బొలెరో వాహనం తునాతునకలైంది. మరోవైపు టిప్పర్‌ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా మారింది. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu