Alluri District Blast: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట సమీపంలోని మైనింగ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఓ ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న ఓ గుత్తేదారుకు సంబంధించిన వాహనంలో డీజిల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మృతి చెందినవారి వివరాలు, ప్రమాదం జరిగిన తీరుపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కానీ, పేలుడు ధాటికి మృతదేహాలు చల్లాచదరుగా.. దూరంగా ఎగిరిపోయిన దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.. మరోవైపు, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు..

