Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..

Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..

NTV Telugu 2 weeks ago

Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంబంధించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై ఈ చర్యలు తీసుకుంది.

అంబటి రాంబాబు పోస్టు చేసిన వీడియోలో పెమ్మసాని చంద్రశేఖర్‌కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు చూపించారు. ఈ వీడియో తప్పుడు ప్రచారానికి ఉద్దేశించినదని ఆరోపిస్తూ టీడీపీ నేత మద్దిరాల మ్యానీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో, ఉద్దేశపూర్వకంగా కేంద్ర మంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేలా అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయం అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసింది. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే తప్పుడు వీడియోలపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu