Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..

Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..

NTV Telugu 1 week ago

Ambati Rayudu: ఐపీఎల్ 2026 సీజన్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. కొన్ని జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, మిగతా జట్లు ప్లేఆఫ్స్ కోసం తీవ్ర పోటీ పడుతున్నాయి.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో RCB 16 పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్స్ ఉన్నా నెట్ రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే ఐపీఎల్ 2026 టోర్నీ నుండి ఎలిమినేట్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ESPN Cricinfoతో మాట్లాడిన రాయుడు, తన దృష్టిలో IPL 2026లో అత్యుత్తమ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అని పేర్కొన్నారు. గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన చేస్తోందని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా ఈ సీజన్ కెప్టెన్లకు రాయుడు తన ర్యాంకింగ్స్ కూడా ఇచ్చాడు. ఆయన జాబితాలో శుభ్‌మన్ గిల్ తొలి స్థానంలో నిలవగా, రజత్ పాటిదార్ రెండో స్థానంలో, ప్యాట్ కమిన్స్ మూడో స్థానంలో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను నాలుగో స్థానంలో ఉంచిన రాయుడు, లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్‌లో అత్యంత నిరాశపరిచిన కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు.

ఇక గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో అన్ని విభాగాల్లోనూ సమతూక ప్రదర్శన చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో జట్టు నిలకడగా రాణిస్తోంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్, 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వ్యక్తిగతంగా కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన గిల్ 42.45 సగటుతో 467 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 158.30గా ఉండటం విశేషం. ఈ క్రమంలో నాలుగు అర్ధసెంచరీలు కూడా నమోదు చేశాడు. గిల్ దూకుడైన బ్యాటింగ్‌తో పాటు చక్కటి కెప్టెన్సీ చేస్తుండడతో గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu