Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!

AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!

NTV Telugu 1 week ago

Lava AGNI 4N Launched: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ లావా లిమిటెడ్‌ (Lava) అంతర్జాతీయ మార్కెట్‌లో మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తన ప్రీమియం అగ్ని (AGNI) సిరీస్‌లో భాగమైన లావా అగ్ని 4N (Lava AGNI 4N) స్మార్ట్‌ఫోన్‌ను యూకే మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది.

అందుబాటు ధరలో మిడ్‌రేంజ్‌ నుంచి హైఎండ్‌ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. యూకేలో అగ్ని సిరీస్‌ విడుదల కావడం మొదటిసారి. ఈ లాంచ్‌ కోసం SW నెట్వర్క్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది.

ఈ కొత్త మొబైల్ లో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1220 × 2712 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 2,400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 1.07 బిలియన్‌ రంగులు, 446 PPI, 100%కి పైగా NTSC కలర్‌ గామట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిస్‌ప్లేకు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 రక్షణ కల్పించారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm టెక్నాలజీతో తయారు చేసిన MediaTek Dimensity 8350 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 3.35GHz వరకు క్లాక్‌ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్‌ కోసం Mali-G615 MC6 GPU ఉంది. ఫోన్‌ 8GB LPDDR5X RAM, 256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

మొబైల్ వెనుక భాగంలో డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్‌ కెమెరాను అందించారు. ఇది 1/1.55 అంగుళాల సెన్సార్‌, f/1.88 అపెర్చర్‌తో పనిచేస్తుంది. దీనికి 8MP అల్ట్రా వైడ్‌ కెమెరా జత చేశారు. వీడియో రికార్డింగ్‌లో 4K 60fps వరకు సపోర్ట్‌ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 50MP కెమెరాను ఇచ్చారు. ఫ్రంట్‌ కెమెరా కూడా 4K 60fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని అందించారు. దీనికి 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌, స్టీరియో స్పీకర్లు, USB టైపు-C ఆడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఫోన్‌కు IP64 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ లభించింది. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, డ్యూయల్‌ 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్‌ 5.4, GPS, GLONASS, Galileo, QZSS, Beidou వంటి సదుపాయాలు ఉన్నాయి. అలాగే కంపెనీకి చెందిన Vayu AI వ్యవస్థను అందించారు. ఇందులో వాయిస్‌ ఆధారిత కాంటెక్స్ట్‌ ఇంటరాక్షన్స్‌, Circle-to-Search వంటి ఫీచర్లు ఉన్నాయి. AI Text Assistant, AI Call Summary, Document/Image Analyzer వంటి టూల్స్‌ కూడా లభిస్తాయి. ఫోటోగ్రఫీ కోసం AI ఫోటో ఎడిటర్, ఇమేజ్ జనరేటర్, సీన్‌ ఆప్టిమైజేషన్‌ వంటి జనరేటివ్‌ AI ఫీచర్లను కూడా ఫోన్‌లో అందించారు.

Lava AGNI 4N యూకేలో 8GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర £499గా నిర్ణయించారు. యూకేలో సెప్టెంబర్‌ 4 నుంచి అమెజాన్ UK ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అమ్మకాల తర్వాత సేవలను SBE Ltd భాగస్వామ్యంతో లావా అందించనుంది. హార్డ్‌వేర్‌ లోపాలకు 24 నెలల హ్యాండ్‌సెట్‌ రీప్లేస్‌మెంట్‌ వారంటీ, బ్యాటరీకి 12 నెలల వారంటీ, డేటా కేబుల్‌కు 6 నెలల వారంటీని కంపెనీ అందిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu