Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ananthika Sanilkumar: 'ఎల్లమ్మ'లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?

Ananthika Sanilkumar: 'ఎల్లమ్మ'లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?

NTV Telugu 3 weeks ago

Ananthika Sanilkumar: టాలీవుడ్‌లో తన ఫస్ట్ సినిమా 'బలగం' తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఎల్లమ్మ'.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 'మ్యాడ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతిక సనిల్‌కుమార్, 8 వసంతాలు చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ బుట్టబొమ్మ 'ఎల్లమ్మ' సినిమాలో హీరోయిన్‌గా నటించడం దాదాపు ఖరారైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. మేకర్స్ ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్, అనంతికలపై ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక 'ఎల్లమ్మ' కథ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ దేవిని నమ్ముకుని సంప్రదాయ జానపద కళలను ప్రదర్శించే ఓ కళాకారుల బృందం ఎదుర్కొనే కష్టాలు, వారి జీవన పోరాటాలు, భావోద్వేగాల చుట్టూ ఈ చిత్ర కథ సాగుతుందని సమాచారం. 'బలగం' తరహాలోనే పల్లెటూరి నేటివిటీ, బలమైన ఎమోషన్‌ను వేణు యెల్దండి ఈ చిత్రంలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. రగ్గడ్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఆయన కనిపించిన ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంగీత దర్శకుడిగా ఎన్నో హిట్స్ అందుకున్న డీఎస్పీ.. ఈ సినిమాతో హీరోగా ఎలా మెప్పిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా అనంతిక పేరు దాదాపు ఖరారైనట్లు వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్‌గా, సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రోమాంచకం చిత్రంతో సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu