Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anirudh : హీరోల స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

Anirudh : హీరోల స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

NTV Telugu 3 weeks ago

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. తనదైన స్టైల్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు హైప్ తీసుకురావడంలో అనిరుధ్ సిద్ధహస్తుడు.

అందుకే ఇప్పుడు అగ్ర హీరోలు అలాగే దర్శకులు తమ చిత్రాలకు అనిరుధ్ కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో అని పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

తెలుగులో అని ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ కోసం అనిరుధ్ సుమారు రూ. 15 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను పెంచేసింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ AA23 కోసం అనిరుధ్ ఏకంగా రూ. 21 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అలాగే బాలయ్య – కొరటాల సినిమాకు కూడా అనిరుధ్ పేరు వినిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో అనిరుధ్ క్రేజ్ మరింత పెరిగబోతుంది. రాబోయే సినిమాలు అన్ని పాన్ ఇండియా స్థాయి సినిమాలే. ఇదే జోష్ కొనసాగితే అతి త్వరలోనే అనిరుధ్ పారితోషికం రూ. 25 కోట్లకు పైగా చేరుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్థాయి రెమ్యూనరేషన్ చాలా మంది టైర్-2 హీరోల పారితోషికంతో సమానమని చెప్పవచ్చు. మ్యూజిక్ రైట్స్ మార్కెట్ ఆశించిన మేర లేకున్న అనిరుధ్ పేరుతో వచ్చే బిజినెస్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆయన కోరినంత ఇచ్చేందుకు వెనకాడటం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu