Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ

Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ

NTV Telugu 6 months ago

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా బీజేపీ అభ్యర్థుల లిస్ట్ విడుదల అయింది.

అయితే ఈ జాబితాలో మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేరు లేకపోవడంతో రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. ఆయన పార్టీకి దూరం అవుతున్నారని.. లేదంటే పార్టీనే దూరం పెట్టిందంటూ రకరకాలైన వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ వదంతులపై అన్నామలై క్లారిటీ ఇచ్చారు. కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చిన అన్నామలై.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తానే స్వయంగా పోటీ చేయాలనుకోవడం లేదని.. ఈ ఎన్నికల్లో చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందుకే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని క్లారిటీ ఇచ్చారు. ఇకపై తాను ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని తెలిపారు.

''నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని కోర్ కమిటీకి ముందే రాతపూర్వకంగా తెలియజేశాను. కాబట్టి నాకు టికెట్ ఇవ్వడం కన్నా.. నిజానికి నేనే పోటీ చేయాలనుకోలేదు.''అని అన్నామలై అన్నారు.

పార్టీని సమర్థిస్తూ.. ''నేనే స్వయంగా పోటీ చేయకూడదని అనుకున్నప్పుడు నాయకత్వం నాకు టికెట్ ఎలా ఇస్తుంది? నన్ను నేను పరిమితం చేసుకోవాలనుకుంటే అది వేరే విషయం. లేకపోతే నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలను.'' అని అన్నారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై పూర్తి మనసుతో న్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. కూటమి భాగస్వాముల కోసం ప్రచారం చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి:Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న

ఇది కూడా చదవండి:UP Video: దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ.. వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు

ఇది కూడా చదవండి:Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu