Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..

Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..

NTV Telugu 14 hrs ago

Anti-SIR Protest: ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్(AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తాకింది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న నేపథ్యంలో తనకు జారీ చేసిన రూ.

10000 పీస్ బాండ్ నోటీసుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆందోళన నేపథ్యంలో న్యూఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEM) కోర్టు అక్టోబర్ 17న ఈ నోటీసు జారీ చేసింది. శాంతిభద్రతల్ని కాపాడేందుకు ఒక పూచికత్తుతో పాటు రూ. 10,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది.

అక్టోబర్ 16న, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెహా బోరా వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి తిరంగా మార్చ్ నిర్వహించారు. జంతర్ మంతర్‌ను అధికారికి నిరసన స్థలం నుంచి తొలగించినప్పటికీ, ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజల్ని కన్నాట్‌ప్లేస్ వైపు వెళ్లేలా నేహా బోరా ప్రేరేపించారని నోటీసుల్లో ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసనలు జరిగాయి.

కోర్టులో వాడీవేడి వాదనలు..

గురువారం ఆమె తన వాదనల్ని హైకోర్టులో వినిపించింది. తాను ఎలాంటి శాంతిభద్రతలకు భంగం కలిగించలేదని, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇచ్చిన పిలుపుతో తనకు సంబంధం లేదని తెలిపింది. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దాఖలు చేసిన నోటీసులు నేహా బోరా 19, 21వ ఆర్టికల్స్ కింద ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా ఉందని ఆమె తరుఫు న్యాయవాది వాదించారు.

ఢిల్లీ పోలీసులు తరుఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. నెహా బోరా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తున్న 12 సందర్భాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ చర్యలు శిక్ష విధించేందుకు కాకుండా, ముందస్తు శాంతిభద్రతలను కాపాడేందుకు అని కోర్టుకు తెలియజేశారు. యాక్టివిస్ట్ ప్రశాంత్ భూషన్, సీజేపీ నాయకులు పాల్గొన్న ఓ సమావేశంలో ప్రభుత్వ మార్పుకు పిలుపునిచ్చారని, అందులో నేహా బోరా కూడా ఉన్నారని పోలీసుల తరుఫున న్యాయవాది ఆరోపించారు.

ప్రభుత్వ వాదనలను నేహా బోరా న్యాయవది తోసిపుచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు కోరుకోవడంలో తప్పు లేదని అన్నారు. అయితే, దీనికి ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు ఎన్నికల ద్వారా జరగాలని, ఢిల్లీలో గుంపులుగా చేరి నిరసనలు చేయడం ద్వారా కాదని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu