Dailyhunt
AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!

AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!

NTV Telugu 1 week ago

AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించడాన్ని ప్రశంసిస్తూ ఏపీ జేఏసీ (APJAC) అమరావతి ఉద్యోగుల సంఘం శనివారం విజయవాడలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది.

ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ ఉద్యోగుల ప్రస్తుత దీనస్థితిని వివరిస్తూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు.

US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!

చాలాకాలంగా రాజధాని లేదనే భావన ఉద్యోగులలో ఉండిపోయిందని, సుస్థిర పాలన కోసం అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా బొప్పరాజు అభినందనలు తెలిపారు. అయితే రాజధానిలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. 12వ పీఆర్సీ (PRC) అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని తప్పుపడుతూ, వెంటనే పీఆర్సీ కమిషనర్‌ ను నియమించాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వంలో ఐఆర్ 27% ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో దాని గురించి కనీసం చర్చ కూడా జరగడం లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడేళ్ల నుంచి ఐఆర్ తీసుకుంటున్నారు. మేము ఐఆర్ లేకుండా ఎలా పని చేయాలో ప్రభుత్వం ఆలోచించాలి. రావాల్సిన బకాయిలు అందకుండానే రిటైర్ అయిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత దీనస్థితిలో ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. మోదీని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ మాట్లాడుతూ.. ఈహెచ్‌ఎస్ (EHS) విధానంలో మార్పులు చేసి పూర్తిగా క్యాష్‌లెెస్ ట్రీట్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే, ఆర్టీసీలో 10 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ‘స్త్రీశక్తి’ పథకం తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగి ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఆర్టీసీలో రోజుకొక ఉద్యోగి చనిపోతున్నారని ఆయన వాపోయారు.

Healthy Summer Drinks : షుగర్, బీపీ ఉన్నవారికి సైతం బెస్ట్ సమ్మర్ డ్రింక్.. ఈ హెల్తీ డ్రింక్‌ను సింపుల్‌గా ఇలా చేసేయండి!

ప్రభుత్వంలోని ఏ విభాగంలోనూ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లేకుండా చేశారని, ఒక్కో ఉద్యోగి నలుగురి పని చేయాల్సి వస్తోందని సంఘం నేతలు మండిపడ్డారు. 2018 నాటి డీఏ అరియర్స్ కూడా ఇంకా 40% మందికి అందలేదని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, పరిష్కారం లభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu