Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP SIR Voter List Revision: ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..

AP SIR Voter List Revision: ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..

NTV Telugu 1 week ago

AP SIR Voter List Revision: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) అభ్యర్థన మేరకు ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌ను సవరించి గడువును పొడిగించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 10వ తేదీ వరకు దాఖలు చేసుకోవచ్చు. ఓటర్ల నుంచి అందే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించేందుకు అక్టోబర్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

అనంతరం అన్ని ప్రక్రియలను పూర్తి చేసి అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఓటర్లకు తమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే గడువులోగా తెలియజేసే అవకాశం మరింత పెరిగింది. సవరించిన ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌ను వెంటనే రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే షెడ్యూల్‌లో చేసిన మార్పులపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సూచించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలను సరిచేసేందుకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల ప్రక్రియ కీలకంగా ఉంటుంది. గడువు పొడిగింపుతో ఓటర్లకు తమ వివరాలను పరిశీలించుకునేందుకు అదనపు సమయం లభించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu