Dailyhunt
AP SSC Results 2026: టెన్త్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..

AP SSC Results 2026: టెన్త్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..

NTV Telugu 1 week ago

AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి. ఈసారి 96.02 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచాయి.

ప్రభుత్వ పరిధిలో విద్యార్థుల సంఖ్యాపరంగా ఉన్న గురుకులాల్లో ఎంజేపీ సంస్థలు అగ్రస్థానంలో నిలవడం విశేషం. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా, నరవాడ ఎంజేపీ పాఠశాలకు చెందిన విద్యార్థులు 596, 593 మార్కులు సాధించి విశిష్ట ఫలితాలు నమోదు చేశారు. మొత్తం 100 పాఠశాలల్లో 30 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం ఈ సంస్థల విద్యా ప్రమాణాలను మరోసారి నిరూపించింది.

Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్‌ కీలక వ్యాఖ్యలు!

ఈ అద్భుత విజయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కృషి ఫలితంగానే ఈ మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల విద్యోన్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని అన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని, బీసీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజేపీ బీసీ గురుకులాల ఈ విజయంతో ప్రభుత్వ విద్యా సంస్థలపై విశ్వాసం మరింత పెరిగిందన్నారు మంత్రి సవిత.. కాగా, ఈ ఏడాది 6,18,131 మంది టెన్త్‌ పరీక్షలు రాయగా.. 5,26,9654 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. అంటే 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.. బాలురు 82.68 శాతం పాస్‌ అయితే.. బాలికలు 87.9 శాతం పాస్‌ అయ్యి మరోసారి సత్తా చాటారు.. ఇక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభమై జూన్ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ విద్యను కొనసాగించేందుకు మరో అవకాశం లభిస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోపు ఫీజు చెల్లించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. ఇక, ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా అవకాశం కల్పించారు. మే 1 నుంచి మే 7 వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సరైన ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అధికారులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu