Dailyhunt
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

NTV Telugu 1 week ago

AP SSC Supplementary Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి.. అయితే, పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఊరటనిస్తూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

ఫలితాల్లో విఫలమైన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావడానికి ఈ అవకాశం ఉపయోగపడనుంది. అధికారుల ప్రకటన ప్రకారం, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభమై జూన్ 4 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు తమ విద్యను కొనసాగించేందుకు మరో అవకాశం లభిస్తుంది.

Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య వివాహం

ఇక, టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మే 1 నుంచి మే 9 వరకు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోపు ఫీజు చెల్లించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. మరోవైపు టెన్త్‌ ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా అవకాశం కల్పించారు. మే 1 నుంచి మే 7 వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సరైన ప్రణాళికతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఈ ఏడాది 6,18,131 మంది టెన్త్‌ పరీక్షలు రాయగా.. 5,26,9654 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. అంటే 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.. బాలురు 82.68 శాతం పాస్‌ అయితే.. బాలికలు 87.9 శాతం పాస్‌ అయ్యి మరోసారి సత్తా చాటారు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu