AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలకు అత్యవసర వాతావరణ హెచ్చరిక జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే మూడు గంటల్లో అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో మన్యం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
Raghav chadha: బీజేపీలోకి రాఘవ్ చద్దా..?
ఇక, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా పిడుగులు పడే సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని, అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ హెచ్చరికతో సంబంధిత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా మారుతున్నారు… కాగా, పిడుగులు ఏ జిల్లాల్లో పడతాయి అనేది ముందే హెచ్చరించడం ద్వారా ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేయడంతో పాటు.. ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగంగా ఉంది..

