Dailyhunt
Arshdeep Singh History: ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ 'సెంచరీ'.. ఏకైక బౌలర్‌గా అరుదైన రికార్డు!

Arshdeep Singh History: ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ 'సెంచరీ'.. ఏకైక బౌలర్‌గా అరుదైన రికార్డు!

NTV Telugu 0 months ago

Arshdeep Singh IPL 100 Wickets: పంజాబ్ కింగ్స్ యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.

ఐపీఎల్‌ 2026లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ వికెట్ తీయడంతో ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. దీంతో భారత టీ20 లీగ్ చరిత్రలో 100 వికెట్లు తీసిన 31వ బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. ఐపీఎల్‌లో వంద వికెట్లు సాధించిన ఐదో లెఫ్టార్మ్ పేసర్‌, నాలుగో భారత బౌలర్‌గా కూడా నిలిచాడు.

అర్ష్‌దీప్ సింగ్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడగా.. అన్నీ పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తరఫునే ఆడాడు. పంజాబ్ టీమ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్ రికార్డు సృష్టించాడు. తన స్వింగ్, యార్కర్‌లతో కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ పంజాబ్ జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా అర్ష్‌దీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున 84 మ్యాచ్‌లలో 127 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో కూడా కీలక సభ్యుడిగా ఉన్నాడు.

ఐపీఎల్‌లో ఒకే జట్టు తరఫున 100కి పైగా వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ చోటు సంపాదించాడు. ఈ జాబితాలో సునీల్ నరైన్ (195 – కేకేఆర్), జస్‌ప్రీత్ బుమ్రా (183 – ఎంఐ), లసిత్ మలింగ (170 – ఎంఐ), భువనేశ్వర్ కుమార్ (157 – ఎస్ఆర్‌హెచ్), రవీంద్ర జడేజా (143 – సీఎస్‌కే), డ్వేన్ బ్రావో (140 – సీఎస్‌కే), యుజ్వేంద్ర చహల్ (139 – ఆర్‌సీబీ), హర్భజన్ సింగ్ (127 – ఎంఐ) వంటి దిగ్గజాల సరసన అర్ష్‌దీప్ (101 – పీబీకేఎస్) నిలిచాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu