Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్‌శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..

Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్‌శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..

NTV Telugu 1 week ago

Asaduddin Owaisi: మధ్యప్రదేశ్ ధార్‌లోని భోజ్‌శాల వివాదాస్పద స్థలంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ''భోజ్ శాల ఒక ఆలయం'' అని స్పష్టం చేసింది.

అయితే, ఈ తీర్పును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది బాబ్రీ మసీదు తీర్పును పోలి ఉందని, సుప్రీంకోర్టు ఈ తీర్పును రద్దు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ''సుప్రీంకోర్టు దీనిని సరిదిద్ది, ఈ ఉత్తర్వును రద్దు చేస్తుందని మేము ఆశిస్తున్నాము. బాబ్రీ మసీదు తీర్పుతో స్పష్టమైన సారూప్యతలు ఉన్నాయి'' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తున్న ముస్లిం పక్షం కూడా చెప్పింది. తాము సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని ధర్ షహర్ ఖాజీ వకార్ సాదిక్ అన్నారు.

Bhojshala case: "భోజ్‌శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..

ఎన్నో దశాబ్ధాలుగా ఉన్న ఈ వివాదంపై శుక్రవారం మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భోజ్‌శాల సముదాయం, సరస్వతీ దేవికి అంకితం చేయబడిన ఆలయమని హైకోర్టు శుక్రవారం ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అదే సమయంలో, మసీదు నిర్మాణం కోసం జిల్లాలో ప్రత్యేక భూమిని కేటాయించాలని కోరుతూ ముస్లిం సమాజం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చని కూడా పేర్కొంది. భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదు వివాదంపై తన తీర్పును వెలువరిస్తూ, భోజ్‌శాల స్థలంలో ఒక సంస్కృత బోధనా కేంద్రం, సరస్వతీ దేవి ఆలయం ఉన్నట్లు సూచనలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu