Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

NTV Telugu 2 weeks ago

August Movies Release: 2026లో తొలి అర్ధభాగంలో సంక్రాంతి సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మాత్రం టాలీవుడ్‌కు పెద్దగా కలిసిరాలేదు.

జూన్, జూలై నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా.. మరికొన్ని డివైడ్ టాక్ వచ్చినా నిలదొక్కుకున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు నెలపై పడింది. గత ఏడాది ఆగస్టులో టాలీవుడ్ నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అయితే ఈసారి మాత్రం ఆగస్టు నెలలో వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ పలు చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. ఆగస్టు 7న మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'కోకా' (కోరియన్ కనకరాజు) విడుదల కానుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఇప్పటికే ఆసక్తి నెలకొంది. అదే రోజున మరో యాక్షన్ ఎంటర్టైనర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న డీసీ చిత్రం కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది.

ఇదే సమయంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆగస్టు 14న పలు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కోర్ట్ రూమ్ డ్రామా 'పళ్ళ బురుసు' ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న హారర్ మూవీ 'అగధ' కూడా రిలీజ్ కానుంది. ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'విశ్వనాథన్ అండ్ సన్స్' కూడా ఆగస్టు 14న విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొలుత బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా భావించినప్పటికీ.. ఇది తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మాస్ మహారాజా రవితేజ కొత్త లుక్‌లో కనిపించనున్న చిత్రం 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఆగస్టు 28న రావాల్సిన శర్వానంద్ 'భోగి' విడుదలపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ విడుదల కాకపోవడంతో.. అనుకున్న తేదీకి సినిమా వచ్చే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టులో తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా భారీ పోటీ ఇవ్వనున్నాయి. తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమల నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాతో పాటు సూర్య చిత్రం, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మలయాళ చిత్రం 'ఐ యామ్ గేమ్' ఆగస్టు 20న విడుదల కానుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న 'ఖలీఫా' కూడా తెలుగు విడుదలపై ఆసక్తి నెలకొంది. ఆగస్టు చివరి వారంలో స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కేజీఎఫ్ 2' తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న యష్ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మొత్తంగా చూస్తే.. ఆగస్టు నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కీలకంగా మారనుంది. ప్రతి వారం కొత్త సినిమాలు పోటీ పడుతుండటంతో మూవీ లవర్స్‌కు భారీ ఎంటర్టైన్మెంట్ అందనుంది. మరి ఈ పోటీలో ఏ సినిమాలు విజయం సాధిస్తాయో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu