Dailyhunt
BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్‌పై తీవ్ర ఆరోపణలు

BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్‌పై తీవ్ర ఆరోపణలు

NTV Telugu 2 weeks ago

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్నికైన బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఏడుగురు ఇప్పటికే రాజీనామా చేశారు. ఇందులో నాలుగుగురు ఒక్కరోజులోనే (ఏప్రిల్ 4, 2026) రాజీనామా చేయడం బోర్డు స్థిరత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది.

BCB అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మాత్రం రాజీనామా చేయకుండా, "నేను చివరి వ్యక్తిని" అంటూ దృఢ సంకల్పం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం భారత్‌తో సంబంధించిన T20 వరల్డ్ కప్ వివాదం నుంచి మొదలైంది. అమీనుల్ ఇస్లాం భారత్‌లో మ్యాచులు ఆడకుండా గట్టిగా నిర్ణయం తీసుకుని, ICC పై తీవ్ర విమర్శలు చేశారు.

అక్టోబర్ 2025లో ఎన్నికైన 25 మంది డైరెక్టర్లలో ఇప్పటికే 7 మంది రాజీనామా చేశారు. ఇంతకు ముందు ఇష్టియాక్ సాదెక్, అమ్జాద్ హోసెయిన్, యాసిర్ మహమ్మద్ ఫైసల్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు బోర్డు లోపలి అసంతృప్తి, రాజకీయ జోక్యం, ఎన్నికల్లో అవకతవకల ఆరోపణల నుంచి ఉద్భవించాయి. నేను చివరి వ్యక్తిని"బోర్డు మీటింగ్ తర్వాత జమునా TVకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీనుల్ ఇస్లాం బుల్‌బుల్ స్పష్టంగా చెప్పారు.

"నేను కుర్చీలో కూర్చుంటాను, మరేం చేయగలను? నేను చివరి వ్యక్తిని." "మా టీమ్ (డైరెక్టర్లు) చాలా మంచివారు, అంకితభావం కలవారు, నిజాయితీపరులు. వీరితోనే బంగ్లాదేశ్ క్రికెట్‌ను సేవ చేయాలనుకుంటున్నాను." "నేను ICCలో పని చేసిన ఏకైక బంగ్లాదేశీయుడిని. నా అనుభవం కారణంగా ఇక్కడ ఉన్నాను. దేశం కోసం అన్నీ వదిలి వచ్చాను. ఇది నాది కాకపోతే మరో మార్గం చూసుకుంటాను. కానీ దేశాన్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను." అని వెల్లడించారు.

భారత్‌పై అమీనుల్ ఇస్లాం తీవ్ర విమర్శలు

T20 వరల్డ్ కప్ వివాదం ఈ సంక్షోభం మూలం భారత్‌తో ముడిపడి ఉంది. 2026 T20 వరల్డ్ కప్ (భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యం)లో బంగ్లాదేశ్ భారత్‌లోని మ్యాచులు ఆడకుండా నిర్ణయం తీసుకుంది. అమీనుల్ ఇస్లాం బుల్‌బుల్ స్పష్టంగా చెప్పారు. "మా ఏకైక డిమాండ్ వరల్డ్ కప్ ఆడాలి, కానీ భారత్‌లో కాదు." భారత్‌లో సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని, మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ICCని కోరామని, కానీ ICC నిరాకరించిందని తీవ్రంగా విమర్శించారు. ICC డబుల్ స్టాండర్డ్స్ అని ఆరోపించారు. భారత్ వేదికల నుంచి మార్చకపోవడం, బంగ్లాదేశ్‌ను స్కాట్లాండ్‌తో భర్తీ చేయడం వంటి నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu