Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీ ఆఫర్ పట్టేసిన మహేష్ హీరోయిన్ .?

భారీ ఆఫర్ పట్టేసిన మహేష్ హీరోయిన్ .?

NTV Telugu 6 years ago

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ ఫ్రాంచైజీ చిత్రాలు ప్రేక్షకులని ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2003లో వచ్చిన కోయి మిల్‌గయా తర్వాత 2006లో క్రిష్, 2013లో క్రిష్ 3 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవి అభిమానులకి అమితానందాన్ని కలిగించడంతో క్రిష్ 4 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే క్రిష్ 4 కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, దీనికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.హృతిక్ గ్రహాంతర ఫ్రెండ్ జాదూ ఈ మూవీలో మరోసారి కనిపించనున్నాడట. అయితే తాజాగా క్రిష్ 4 లో నక్షత్ర మండలాల్లోకి ప్రయాణించే థీమ్ చూపించనున్నారట. ఇప్పటి వరకు క్రిష్ సిరీస్ లో హీరోయినుగా ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్ జోనస్ తో కలిసి అమెరికాలోనే సెటిల్ అయింది. ఇక హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్ సరసన కృతి సనన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం అవుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu