Dailyhunt
బీజేపీ, జనసేన మాత్రమే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలవు !

బీజేపీ, జనసేన మాత్రమే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలవు !

NTV Telugu 5 years ago

ఏపీలో ప్రతిపక్షం చేతులెత్తేసిందని, బీజేపీ, జనసేన మాత్రమే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలవన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. కర్నూల్ లో రోడ్ షో నిర్వహించిన సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేసినా బీజేపీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారాయన. విఆర్వోలు, సీఐలు ఎమ్మెల్యేలు చెప్పినట్లు వింటున్నారని, వైసీపీ ఏకగ్రీవాల కోసం భయానక వాతావరణం తీసుకొచ్చారన్నారాయన. మాట వినని అభ్యర్థులని బెదిరిస్తున్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారన్నారు. కడప లో బీజేపీ కి చెందిన మహిళలని పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరించారన్నారు. ఎన్నికలకు, పోలీసులకు సంబంధం లేదని, పెద్ద ఎత్తున పోలీసులు ఎన్నికల్లో తలదూర్చుతున్నారన్నారు.

పోలీసులు శాంతి భద్రతలు మాత్రమే చూసుకోవాలన్నారు సోము వీర్రాజు. ఏపీలో రెవెన్యూ పోలీసు శాఖలు సరైన విధానంలో పని చేయక పోతే ప్రజలు హర్షించరన్నారు. రాబోయే రోజుల్లో పాలించే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే అద్భుతంగా ఉంటుందన్నారాయన. జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే పెట్రోల్ రేటు తగ్గే అవకాశం ఉంటుందని, జీఎస్టీ పరిధిలోకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదన్నారు సోము వీర్రాజు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu