Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?

BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?

NTV Telugu 2 weeks ago

మాలీవుడ్ హీరో నివిన్ పౌలీ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బెత్లెహం కుడుంబ యూనిట్.. టాలీవుడ్‌లో రిలీజ్ కాబోతుంది. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో విడుదలౌతుంది.

ప్రేమలు ఫేం గిరిష్ ఏడీ దర్శకుడు. ప్రేమలులో మెయిన్ కాస్ట్ ఇక్కడ రిపీట్ చేశాడు దర్శకుడు. హీరో మినహాయిస్తే, హీరోయిన్ మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మెహన్ ఇందులో కూడా నటించారు.

మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద బ్లాక్ బస్టరైంది ప్రేమలు. అదే సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ రిలీజ్ చేశాడు. రూ.1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ వీక్‌లోనే 2కోట్ల షేర్ రాబట్టుకుని లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా రన్ టైం ముగిసే సరికి 15-20 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నెక్ట్స్ ఇదే డైరెక్టర్ అండ్ హీరోయిన్ కాంబోలో వచ్చిన బెత్లెహం కుడుంబ యూనిట్‌ను తెలుగులో రిలీజ్ చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ప్రేమమ్‌తో నివిన్ పౌలీ టాలీవుడ్‌కు తెలిసినా.. థియేటర్స్‌లో రిలీజౌతున్న ఫస్ట్ డబ్బింగ్ ఫిల్మ్ బెత్లెహం కుడుంబ యూనిట్. ఇరుముడి థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నా.. మరో డబ్బింగ్ సినిమాను తీసుకు వస్తుంది మైత్రి మూవీ మేకర్స్. యాక్చువల్లీ నైజాంలో మలయాళ వర్షన్ రిలీజ్ చేస్తేనే..60 లక్షలు రాబట్టుకుందట. అందుకే డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్స్. మరీ ప్రేమలులా బెత్లెహం కుడుంబ యూనిట్ ఇక్కడ మాసివ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందా..? మమితా బైజుకు మరో డబ్బింగ్ మూవీ ఇక్కడ హిట్ నిస్తుందా..? మైత్రికి మంచి లాభాలను తెచ్చిపెడుతుందా..? లెట్స్ సీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu