Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Blackmail : వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?

Blackmail : వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?

NTV Telugu 6 days ago

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. హీరో వరుణ్ సందేశ్, ప్రముఖ నటుడు జెమిని సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం “బ్లాక్ మెయిల్”.

హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అవినాష్ కూనపరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ గుండ్రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీనివాస్ తనకు ఎప్పటినుంచో పరిచయమని, ఈ కథ చెప్పగానే ఇందులో ఉన్న పటిష్టమైన కంటెంట్ చూసి వెంటనే ఓకే చెప్పానని అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలిపారు. నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. వరుణ్ సందేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత అవినాష్ ప్రతి విషయంలో అండగా నిలుస్తున్నారని, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా రూపొందుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమం మొత్తానికి నిర్మాత అవినాష్ కూనపరెడ్డి చేసిన కామెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినీ పరిశ్రమలోకి తాను రావడానికి ముఖ్య కారణం దాదాపు 200 కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యమేనని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో 10% వాటాను సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన టెక్నీషియన్స్‌కు అందిస్తానని, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా భావన పోలేపల్లి వ్యవహరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu