Dailyhunt
Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు

Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు

NTV Telugu 2 weeks ago

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ రోజు పెద్ది చిత్ర బృందం నిర్వహించిన రిలీజ్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్లో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘సుకుమార్ గారికి థాంక్యూ. 'పెద్ది' ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి.ఇది ఒక కమర్షియల్ ఎమోషనల్ రైడ్. మీ అందరి హృదయాలకు దగ్గరగా ఉంటుంది. పెద్దిని మీ హృదయం నుంచి తీసేయడం అంత ఈజీ కాదు. చరణ్ సార్‌పై నా ప్రేమ జూన్ 4న మీరు చూస్తారు. ఈ అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి థాంక్యూ సో మచ్’ అని అన్నారు. అనంతరం ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమాగా ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రామ్ చరణ్ గారికి జీవితకాలం రుణపడి ఉంటాను. బుచ్చిబాబు చాలా అద్భుతంగా సినిమా తీశారు. రామ్ చరణ్, జాన్వి కపూర్ ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్లకు వచ్చి చూడండి. పెద్ది కమర్షియల్, ఎమోషనల్ రైడ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ థియేటర్స్ లో చూడగలిగే సినిమా. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది, నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను. జూన్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. జూన్ 3 ఈవెనింగ్ అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉంటాయి. షూటింగ్ జరిగిన రోజులన్నీ రామ్ చరణ్ గారితో కలిసి భోజనం చేసే అవకాశం దొరికింది. ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం మాకు పెట్టేవారు. ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది. ఈ సినిమాలో సుకుమార్ గారు కూడా నాకు పార్ట్నర్‌గా ఉండడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu