Dailyhunt
చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌:  ఆ రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.

చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌: ఆ రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.

NTV Telugu 4 years ago

రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

వైరస్ వ్యాప్తి తరువాత ఇప్పుడు మరోసారి చైనాలో కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాని దక్షిణ ప్రావిన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. డెల్టావేరియంట్ కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుతియాన్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. ఇంటినుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu