Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం

NTV Telugu 1 week ago

శ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా కొట్టిమిట్టాడుతున్నాయి. చమురు, గ్యాస్ కొరతతో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పౌరులకు పొదుపు మంత్రం పాటించాలని సూచించారు.

ఇప్పటికే ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్రాల వరకు అదే సూత్రాన్ని పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహానాడు-2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు అంతా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు.

పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ భవన్‌లో స్టేజీ ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ భవన్‌లో పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 27, 28న పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం జరగనుంది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్‌లో అమలవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu