Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chiranjeevi: అయోధ్య 'సూర్య తిలకం' లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!

Chiranjeevi: అయోధ్య 'సూర్య తిలకం' లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!

NTV Telugu 6 months ago

మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడంటే ఎంతటి భక్తియో అందరికీ తెలిసిందే. తన విజయాల వెనుక ఆ వాయుపుత్రుడి ఆశీస్సులు ఉన్నాయని ఆయన నమ్ముతారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా తన ఇంట్లోని పూజా మందిరంలో జరిగే ఒక అద్భుతాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు.

ప్రతి ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్య కిరణాలు సప్తవర్ణాలుగా మారి, తన ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని పాదాల నుండి శిరస్సు వరకు స్పృశిస్తూ సాగడం ఒక వింత అని చిరు పేర్కొన్నారు.

ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించిన 'సూర్య తిలకం' దృశ్యాన్ని గుర్తు చేస్తూ.. తన ఇంట్లో కూడా అలాంటి దైవానుభూతి కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు అరసవిల్లి, కోణార్క్ వంటి పుణ్యక్షేత్రాల్లో జరిగే ఈ అద్భుతం తన ఇంట్లోనూ జరగడం విశేషమని ఆయన వీడియోలో వివరించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు, భక్తులందరికీ ఆయన హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. అయితే ఉత్తరాది సంప్రదాయం ప్రకారం చైత్ర పూర్ణిమ నాడు (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. చిరంజీవి ఈ విశేషమైన రోజునే తన ఇలవేల్పుకు సంబంధించిన ఈ వీడియోను షేర్ చేసి అందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu