Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?

CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?

NTV Telugu 1 week ago

CM Vijay: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం ఆయన మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి శాఖల్ని సీఎం విజయ్ తన వద్దే పెట్టుకున్నారు.

శాఖల కేటాయింపులను పరిశీలిస్తే.. విజయ్ ప్రజా, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక కార్యక్రమాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, బాలల సంక్షేమం, వృద్ధులు- దివ్యాంగుల సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా శాఖల బాధ్యతలను తన వద్దే ఉంచుకున్నారు.

సీనియర్ నాయకుడు అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన సెంగొట్టయ్యన్‌కు ఆర్థిక శాఖను కేటాయించారు. విజయ్ కేబినెట్‌లో అతి చిన్న వయస్కురాలైన ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ లభించింది. దీంతో పాటు ఈమె పెట్టుబడుల ప్రోత్సహక విభాగాన్ని కూడా పర్యవేక్షిస్తారు. మహిళా మంత్రికి ఇలా కీలకమైన శాఖను కేటాయించడం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్. ఆనంద్ గ్రామీణాభివృద్ధి , జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు ,పేదరిక నిర్మూలన కార్యక్రమం, చిన్న నీటిపారుదలతో సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలోని శాఖలలో ఉన్నాయి. టీవీకేలో మరో కీలక నేతగా ఉన్న అదవ్ అర్జునకు పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖల్ని కేటాయించారు. వీటితో పాటు రహదారులు, భవనాలు, చిన్నఓడరేవును కూడా పర్యవేక్షిస్తారు.

డాక్టర్ కేజీ అరణ్ రాజ్‌కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖల్ని కేటాయించారు. పి వెంటకరమణన్‌కు ఆహార, పౌర సరఫరాలను కేటాయించారు. ఆర్ నిర్మల్ కుమార్‌కు ఇంధన వనరులు, విద్యుత్, కోర్టులు, జైళ్లు, అవినీతి నివారణ వంటికి ఈయన పరిధిలో ఉండనున్నాయి. రాజ్‌మోహన్‌కు పాఠశాల విద్యా, తమిళ అభివృద్ధి, సమాచార మరియు ప్రచార శాఖల్ని స్వీకరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఈయనే ఉండనున్నారు. డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖను కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖను ఈయన నిర్వహిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu