Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..

CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..

NTV Telugu 1 week ago

సామాన్యులకు చెల్లు పెడుతూ నేడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటితో పాటే వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే సిలిండర్ గ్యాస్ (CNG) ధరలను కూడా పెంచేశారు.

ఇరాన్ దేశంలో జరుగుతున్న గొడవల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ప్రముఖ గ్యాస్ కంపెనీలు ధరలను పెంచక తప్పలేదు. ముంబైలో ధరలు పెంచిన మరుసటి రోజే ఢిల్లీలో కూడా సీఎన్‌జీ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీలో గ్యాస్ పంపిణీ చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలో సీఎన్‌జీపై రూ. 2 పెంచింది. దీనివల్ల అక్కడ కిలో గ్యాస్ ధర రూ. 77.09 నుండి రూ. 79.09 కి చేరింది. అంతకుముందు రోజే ముంబై మరియు దాని పరిసర ప్రాంతాలలో మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) కూడా కిలోపై రూ. 2 పెంచడంతో అక్కడ కొత్త ధర రూ. 84 కి చేరుకుంది. ఇలా గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఈ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పడిపోయాయి. మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, ఐజీఎల్ మరియు ఎమ్జీఎల్ కంపెనీల షేర్లు దాదాపు 3 శాతానికి పైగా నష్టపోయాయి.

ఈ ధరల పెరుగుదల ప్రభావం సామాన్య ప్రయాణికులపై, రవాణా రంగంపై తీవ్రంగా పడనుంది. సీఎన్‌జీ రేట్లు పెరిగిన వెంటనే ముంబైలోని ఆటో రిక్షా సంఘాలు తమ ఆటో ఛార్జీలను కూడా పెంచాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఇంధన ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల డ్రైవర్ల సంపాదన తగ్గిపోతోందని, పాత ఛార్జీలతో ఆటోలు నడపడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu