Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న 'నౌరు'.. కొత్త పేరు ఇదే..

Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న 'నౌరు'.. కొత్త పేరు ఇదే..

NTV Telugu 1 week ago

సిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశమైన నౌరు, తన జాతీయ భాషా ఉచ్ఛారణ, స్పెల్లింగ్ కు అనుగుణంగా తన పేరును 'రిపబ్లిక్ ఆఫ్ నవోరో'గా మార్చుకుంది.

దీనితో పాటు అంతర్జాతీయ కోడ్ 'NRU' నుంచి 'NRO'కి మారుతుంది, అలాగే అక్కడ నివసించే ప్రజలను నౌరుయన్లకు బదులుగా ‘దేయ్-నవోరో’ అని పిలుస్తారు. అంతర్జాతీయంగా “నౌరు” అనే పేరు విదేశీయుల ఉచ్చారణ సౌలభ్యం కోసం వచ్చిందే తప్ప, అది తమ స్వంత ఎంపిక కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చారిత్రక మార్పు ద్వారా తమ దేశం కోల్పోయిన సంస్కృతి, భాష, జాతీయ గుర్తింపును తిరిగి గౌరవించుకుంటున్నామని ఆ దేశ అధ్యక్షుడు డేవిడ్ అడియాంగ్ తెలిపారు. పార్లమెంటులో అవసరమైన రౌండ్ల ఓటింగ్ పూర్తయ్యాక, ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండమ్) అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ‘నవోరో’ అనేది ఇప్పటికే రాజ్యాంగంలో, జాతీయ చిహ్నంలో, ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా ఉందనేది వారి భావన.

కేవలం 12,000 జనాభా కలిగిన నవోరో, ప్రపoచంలోనే మూడవ అతిచిన్న దేశం. మొదట జర్మనీ కాలనీగా ఉండి, ఆ తర్వాత ఆస్ట్రేలియా పాలనలో ఉన్న ఈ దేశం 1968లో స్వాతంత్ర్యం పొందింది. 1970లలో ఫాస్ఫేట్ మైనింగ్ ద్వారా విపరీతమైన సంపదను చూసినప్పటికీ, 1990ల నాటికి మైనింగ్ రంగం క్షీణించడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం ఈ ద్వీపం వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దీనివల్ల ప్రజలను, మౌలిక సదుపాయాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నిధుల సమీకరణ కోసం ‘పెయిడ్ సిటిజన్‌షిప్’ ప్రాజెక్టులను కూడా నడుపుతోంది.

ఈ పేరు మార్పు ద్వారా నవోరో తన వలసపాలన ముద్ర నుండి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. గతంలో స్వాజిలాండ్ తన పేరును 'ఎస్వాతిని'గా, అలాగే టర్కీ తన పేరును 'తుర్కియే'గా మార్చుకున్న తరహాలోనే నవోరో కూడా ముందడుగు వేసింది. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ఈ కొత్త పేరును నమోదు చేయగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, చైనా వంటి దేశాలు కూడా కొత్త పేరును గుర్తించాయి. ఈ నిర్ణయంతో దేశ విమానాలు, నౌకల పేర్లు మారడంతో పాటు ప్రపంచ దేశాల నుండి కొత్త గుర్తింపు లభిస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu