Dailyhunt
Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?

Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?

NTV Telugu 1 week ago

Cricket Love Storie: క్రికెట్ ప్లేయర్స్‌కు సంబంధించిన లవ్ స్టోరీలు బాగా వైరల్ అవుతుంటాయి. ప్లేయర్స్ పర్ఫామెన్స్ కంటే వీటిపైనే కొంత మంది ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు.

అలాంటి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున యువ ఆల్ రౌండర్ సమీర్ రిజ్వీ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పుడు మైదానంలో తన ఆట కంటే బయట ఓ వివాదం కారణంగా వార్తల్లో నిలిచాడు రిజ్వీ. ప్రముఖ ఇండో-కెనడియన్ స్పోర్ట్స్ యాంకర్ యెషా సాగర్‌తో రిజ్వీ ప్రేమాయణంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక వీరి వయసు విషయానికి వస్తే.. సమీర్ రిజ్వీ 22 ఏళ్లు కాగా.. యెషా సాగర్‌కు 29 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం క్రికెటర్, లీగ్ బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో పనిచేస్తున్న ఒక హిందూ స్పోర్ట్స్ యాంకర్‌తో ప్రేమలో ఉన్నాడు. కానీ ఆ సంబంధంలో కొన్ని వ్యక్తిగత, మతపరమైన అంశాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఉన్నాయని ఓ జర్నలిస్ట్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఈ చర్చకు దారితీసింది.

సదరు జర్నలిస్ట్ తన పోస్ట్‌లో ఎవరి పేర్లను నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆ యాంకర్ స్నేహితురాలి ద్వారా తెలిసిన సమాచారం అంటూ కొన్ని సంచలన విషయాలను పేర్కొన్నారు. ఆ క్రికెటర్ తన వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఆ యాంకర్‌పై రుద్దుతున్నాడు. సోషల్ మీడియాలో ఆమె ప్రవర్తన, ఇతరులతో సామాజిక సంబంధాలపై కొన్ని ఆంక్షలు సైతం విధించాడని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం పరస్పర అంగీకారంతో జరుగుతోందా లేదా అన్నది సంబంధిత వ్యక్తులు స్పందిస్తేనే తెలుస్తుందని ఆ జర్నలిస్ట్ వెల్లడించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అటు సమీర్ రిజ్వీ కానీ, ఇటు యేషా సాగర్ కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

ఇక, ప్రస్తుతం సమీర్ రిజ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 149.28 స్ట్రైక్ రేట్‌తో రెండు హాఫ్ సెంచరీల సాయంతో 209 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. 2024లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రిజ్వీ, మొత్తం 21 మ్యాచ్‌లలో 381 పరుగులు సాధించాడు. మే 1వ తేదీ శుక్రవారం నాడు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు సిద్ధమవుతుండగా, బయట వినిపిస్తున్న ఈ రూమర్లు సమీర్ రిజ్వీని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. కేవలం సోషల్ మీడియా ప్రచారం ఆధారంగానే ఈ వార్తలు వస్తున్నందున, ఇందులో నిజమెంత ఉందనేది వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu