Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో. ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్

Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో. ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్

NTV Telugu 4 months ago

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఒక హత్య, ఒక దర్యాప్తు, చివర్లో ఒక ట్విస్ట్. అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠను, భయాన్ని ఒకేసారి నింపేస్తాయి.

మనిషి శరీరానికి జంతువుల తలలను అమర్చిన శవాలు వరుసగా కనిపిస్తుంటే ఎలా ఉంటుంది? అలాంటి భయంకరమైన సంఘటనల వెనుక ఉన్నది ఎవరు ? ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయాణమే కన్నడ క్రైమ్ థ్రిల్లర్ 'హయగ్రీవ' (Hayagriva). థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ వారకు చాలా ఇంటెన్స్ గా సాగుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

కన్నడ యువ హీరో ధన్వీర కథానాయకుడిగా నటించిన 'హయగ్రీవ' చిత్రానికి రఘు కుమార్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, మే 22వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటికి ఇది కన్నడ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. సీరియల్ కిల్లర్ కథలు, సైకలాజికల్ థ్రిల్లర్లు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక మంచి వీకెండ్ వాచ్‌గా చెప్పవచ్చు. ఇక ఇందులో హయగ్రీవ పాత్రలో ధన్వీర తన నటనతో ఆకట్టుకోగా, సంజనా ఆనంద్ తన పాత్రకు న్యాయం చేసింది. ముఖ్యంగా సైకో కిల్లర్ చుట్టూ అల్లుకున్న సస్పెన్స్, దర్యాప్తు సన్నివేశాలు ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెడతాయి. క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఆసక్తికరమైన ప్రయత్నంగా 'హయగ్రీవ' నిలుస్తుంది.

'హయగ్రీవ' కథ

బెంగళూరులో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ అర్జున్ హయగ్రీవ (ధన్వీర)పాత్రలో కనిపిస్తాడు. అతని భార్య ఐశ్వర్య ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఉన్నప్పటికీ, వృత్తిపరంగా హయగ్రీవకు ఒక భయంకరమైన సవాలు ఎదురవుతుంది. నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అయితే ఆ హత్యల్లో అత్యంత కలవరపెట్టే విషయం ఏమిటంటే, మృతదేహాలపై మనుషుల తలలు లేకపోవడం, వాటి స్థానంలో వివిధ జంతువుల తలలను అమర్చడం. ఈ కేసు వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడని హయగ్రీవ గుర్తిస్తాడు. అతను సాధారణ నేరస్థుడు కాదని, వైద్యశాస్త్రంపై మంచి అవగాహన కలిగిన సైకో కిల్లర్ అని అర్థమవుతుంది. కానీ అతను ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? చనిపోయిన వాళ్ళకి కిల్లర్ కి ఏమిటి సంబంధం ? శరీరాలను ఈ విధంగా మార్చడానికి కారణమేంటి? అనే ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అర్జున్. ఈ క్రమంలో స్టోరీ గూస్ బంప్స్ తెప్పించే మలుపులు తీసుకుంటుంది. చివరికి కిల్లర్ ని అర్జున్ పట్టుకుంటాడా ? కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu