Dailyhunt
Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

NTV Telugu 4 days ago

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అందరూ చెప్పే పేరు ‘మృణాల్ ఠాకూర్’. ‘సీతారామం’తో తెలుగు వారి గుండెల్లో ‘సీత’గా గూడు కట్టుకున్న ఈ మరాఠీ భామ..

ఆ తర్వాత ‘హాయ్ నాన్న’తో మరో క్లాసిక్ హిట్ అందుకున్నారు. ‘ది ఫ్యామిలీ స్టార్’లో అద్భుతంగా నటించిన మృణాల్.. కల్కిలో చిన్న కామియో పాత్రలో మెరిశారు. అయితే రెండు ఘన విజయాలు అందుకున్నప్పటికీ.. మృణాల్ మనసులో ఒక చిన్న భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేదట. ఈ విషయాన్ని తాజాగా ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ బయటపెట్టారు.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన యాక్షన్ ప్రేమకథా చిత్రం ‘డెకాయిట్’. షనీల్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈరోజు చిత్ర యూనిట్ డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు శౌర్యువ్.. మృణాల్ మురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘హాయ్ నాన్న సినిమా చిత్రీకరణ సమయంలో మృణాల్ అప్పుడప్పుడు ఫోన్ చేసేది. ఇక నా వల్ల కాదు.. తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయరు ఏమో అని బాధపడేది. భాషా పరమైన ఇబ్బందులు, పాత్రలో ఒదిగిపోయే క్రమంలో వచ్చే ఒత్తిడి ఏమో తెలియదు కానీ.. ఇక నేను టాలీవుడ్‌లో సినిమా చేయను, ఇదే లాస్ట్ అని చెప్పేది. ఆమె మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు’ అని శౌర్యువ్ చెప్పారు.

‘హాయ్ నాన్న సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రేక్షకులు మృణాల్ ఠాకూర్ నటనకు ఫిదా అయ్యారు. యష్ణ పాత్రకు విశేషమైన గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆమెను ఒక ‘లోకల్ స్టార్’లా ఆదరిస్తున్నారు. డెకాయిట్ కూడా మంచి విజయం అందుకుంటుంది. టాలీవుడ్‌లో నీకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. టాలీవుడ్‌ నుంచి నువ్ తప్పించుకోలేవు. తెలుగులో మంచి పాత్రలు వస్తాయి’ అని దర్శకుడు శౌర్యువ్ ధీమా వ్యక్తం చేశారు. హాయ్ నాన్న సినిమాలో చివరలో ఫైట్ చేసిందని, డెకాయిట్లో ఆది నుంచే సరస్వతిగా ఫైట్ చేస్తుందన్నారు. డెకాయిట్ రూపంలో మరో హిట్ మృణాల్ ఖాతాలో పడుతుందని శౌర్యువ్ చెప్పుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu