Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dada : 'దాదా' మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK

Dada : 'దాదా' మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK

NTV Telugu 1 hr ago

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం 'దాదా'. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మైసూర్ షెడ్యూల్ షూటింగ్ సెప్టెంబర్ 29 నుంచే ప్రారంభం కానుంది. ముందుగా ఇతర కీలక నటీనటులతో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మైసూర్ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై కొన్ని భారీ యాక్షన్ సీన్లు, డ్రామా సన్నివేశాలను తెరకెక్కించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నాడు. చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu