Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!

Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!

NTV Telugu 1 week ago

Tuesday Horoscope August 4 2026: మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి ప్రగతి లభిస్తుంది. నూతన పరిచయాలతో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన పనులలో ఎదురయ్యే ఆటంకాలను విజయవంతంగా అధిగమిస్తారు.

ధార్మిక విషయాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు శ్రీ మల్లికార్జున స్వామిని ఆరాధిస్తూ శివాష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారు నిరుత్సాహాన్ని వీడి కీలకమైన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి. ఆర్థిక వ్యవహారాలలో అత్యంత అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబంలో జరిగే శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. వీరు శ్రీ దుర్గా అమ్మవారిని స్మరిస్తూ దుర్గా కవచాన్ని పారాయణం చేయాలి.

మిథున రాశి వారు అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. గృహ నిర్మాణ పనులలో అంచనాలు కొంత తారుమారయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సమయానికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. వీరు శ్రీ దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తూ నిరంతరం దత్త నామ జపం చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వీరు శ్రీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఉత్తమం.

కుంభ రాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇతరుల అనవసర వ్యవహారాలలో తలదూర్చకూడదు. సొంత పనులపై, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉన్నందున ఆచితూచి అడుగు వేయాలి. వీరు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రపత్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. మీన రాశి వారు భాగస్వామ్య వ్యాపారాలను తిరిగి నిలబెట్టుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు మేలు చేస్తాయి. కీలకమైన పనులు ప్రారంభమవుతాయి. వీరు శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ధ్యానిస్తూ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu