Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్

Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్

NTV Telugu 1 week ago

దేశ వ్యాప్తంగా కీలక ప్రభుత్వ సంస్థలకు బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్ఐఏ, ఇస్రో, డీఆర్డీవో, ఎయిర్ ఇండియా విమానంతో సహా పలు సంస్థలకు పంపిన బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఈ-మెయిళ్ల ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టగా ఘజియాబాద్‌కు చెందిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 36 ఏళ్ల వ్యక్తి 2008 నుంచి మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారని తెలిపారు.

జూన్ 29న పంపిన ఈ-మెయిళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాలతో సహా పలు అత్యంత భద్రతా సంస్థలలో బాంబులు ఉన్నాయని పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.

ఇక బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందిన వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు వెంటనే ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. కార్యాలయం మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu