Dailyhunt
Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

NTV Telugu 2 weeks ago

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అధికారిక గుర్తింపు పొందిన సందర్భంగా ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పందించారు.

ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్.. అనిశ్చితిలో నిలిచిపోయిన భవిష్యత్తు కాదు మన రాష్ట్రం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్ని అన్నారు పవన్ కల్యాణ్‌.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు అని తెలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడం.. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం.. అలాగే భారత రాష్ట్రపతి ఆమోదం లభించడం ద్వారా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూసిన ఆశయం చివరికి నెరవేరిందన్నారు పవన్‌ కల్యాణ్‌..

Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో ప్రజల దీర్ఘకాల స్వప్నం సాకారమైందన్నారు పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిందన్నారు అన్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం.. ఈ చారిత్రక ఘట్టానికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని అన్నారు. గతంలోని అనిశ్చితి, అంతరాయాలను దాటుకుని ప్రజల రాజధానిగా అమరావతిని నిర్మించుకుందామని.. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యంతో ఏపీ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu