Dailyhunt
Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్‌కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!

Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్‌కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!

NTV Telugu 1 week ago

నందమూరి అభిమానులారా.. అస్సలు కంగారు పడకండి.. ఎన్టీఆర్ 'దేవర' సీక్వెల్ గురించి వస్తున్న పుకార్లన్నీ ఉత్తవే. దర్శకుడు కొరటాల శివ, బాలకృష్ణతో సినిమా అనౌన్స్ చేయగానే..

ఇక 'దేవర 2' అటకెక్కినట్టే అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం దేవర రాక పక్కా! ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, కొరటాల శివ ఆ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా ఆయనకు కూడా బాగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉండటం వల్లే కాస్త ఆలస్యమవుతోంది తప్ప, ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. బాలయ్య – కొరటాల సినిమాను 2027 జనవరి నాటికి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా అవ్వగానే కొరటాల శివ తన పూర్తి ఫోకస్ 'దేవర 2' మీద పెట్టబోతున్నారు. అంటే వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కూడా అప్పటికి తన ఇతర కమిట్‌మెంట్లను పూర్తి చేసుకుని రంగంలోకి దిగుతారట. కాబట్టి ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే కానీ, బాక్సాఫీస్ వద్ద దేవర గర్జన మాత్రం ఖాయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu