Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ

Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ

NTV Telugu 1 week ago

2026లో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఇయర్. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్నను వివాహం చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. అటు రష్మిక కూడా తెలుగు కోడలిగా మారిపోయింది.

ఇక పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ ఫినీష్ అయిపోయిన నేపథ్యంలో కెరీర్‌పై ఫోకస్ చేశారు. నెక్ట్స్ ఈ ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలొస్తున్నాయి. ఫస్ట్ ఆనంద్ దేవరకొండ ఎపిక్ మూవీతో సెప్టెంబర్ 11న తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. గం గం గణేషా పరాజయం పాలయ్యాక అతడి నుండి వస్తున్న ఫిల్మ్ ఇదే. 90స్ బయోపిక్ సిరీస్ ఫేం ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తున్నమూవీ కావడంతో అంచనాలున్నాయి.

అక్టోబర్ బరిలోకి దిగుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ విజయ్ అండ్ రష్మిక. రణబాలి షూటింగ్ జరుగుతుండగా పెళ్లి చేసుకున్న ఈ రీల్ కపుల్.. వెడ్డింగ్ అయ్యాక కలిసి వర్క్ చేశారు. టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ ఫిల్మ్ దసరాను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలొచ్చాయి. నవంబర్ నెలను టార్గెట్ చేస్తోంది నేషనల్ క్రష్. హై ఆక్డేన్ యాక్షన్ ఫిల్మ్ మైసా నవంబర్ 27న రాబోతుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు. పెళ్లైన తర్వాత దేవరకొండ ఫ్యామిలీ నుండి వస్తున్న సినిమాలు కావడంతో రిజల్ట్స్ ఎలా ఉంటాయోనన్న క్యూరియస్ కలిగిస్తోంది. రష్మిక లక్.. ఫ్లాప్స్‌లో ఉన్న విజయ్, ఆనంద్ దేవరకొండకు సక్సెస్ అందిస్తుందా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu