Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ

Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ

NTV Telugu 1 week ago

ర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధవారం ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు వేగంగా పనులు చకచకాగా జరుగుతున్నాయి.

అయితే ప్రస్తుతం డీకే.శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో మకాం వేశారు. సోమవారం రాత్రి కేసీ.వేణుగోపాల్‌ను కలిశారు. రేపు ఉదయం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో డీకే.శివకుమార్ సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు.

కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత డీకే.శివకుమార్ ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కుల సమీకరణాలతో పాటు ఉప ముఖ్యమంత్రుల సంఖ్యపై చర్చించనున్నారు. అలాగే తదుపరి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే కుల సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుని కూర్చు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

డీకే.శివకుమార్ కేబినెట్‌ భారీగా ఉండొచ్చని తెలుస్తోంది. తదుపరి ఎలక్షన్‌కు తగినట్టుగా మంత్రివర్గ కూర్పు జరగవచ్చని సమాచారం. ఇక సిద్ధరామయ్య తన అనుచరులకు పెద్ద పీట వేయాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పోస్ట్‌తో కీలక మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్‌తో చర్చిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu