Saturday, 18 Sep, 6.43 pm NTV Telugu

హోమ్
దొంగగా మారిన కీరవాణి తనయుడు శ్రీసింహా!

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న మూవీ ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ జస్టిఫికేషన్ కోసం అన్నట్టుగా ఓ ఫన్నీ వీడియోను తీసి యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి రావడం కోసం హీరో శ్రీసింహా రెండు గంటలు పర్మిషన్ అడిగితే, డైరెక్టర్ ‘నో’ చెప్పడంతో అతను ఏం చేశాడన్నది ఈ వీడియోలో ఉంది. షూటింగ్ చేయాల్సిన కెమెరాలోని మెమొరీ కార్డు మిస్ కావడంతో హీరో కోరుకున్నట్టే. షూటింగ్ ఆగిపోతుంది. దాంతో అతను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిపోతాడు. సో. ఈ మూవీ టీమ్ లోనూ దొంగలున్నారు జాగ్రత్త అని అనుకోవాల్సిన పరిస్థితి. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ఫన్నీ వీడియో వ్యూవర్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముతిర కని ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకుడు. రోహిత్ కులకర్ణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా యశ్వంత్ సీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: ntvtelugu
Top