Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్

Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్

NTV Telugu 2 months ago

కోలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు కార్తీక్ సుబ్బరాజ్. రొటీన్ రెగ్యులర్ కథలతో కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీస్ తో వైవిధ్యభరిత దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్సెపరేట్ మార్క్ క్రియేట్ చేసాడు.

అలా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పేట, సూర్యతో రెట్రో సినిమాలకు డైరెక్టర్ గా ఛాన్స్ అందుకున్నాడు. కానీ రెండు సినిమాలు యావరేజ్ రిజల్ట్ తెచ్చుకోవడంతో కార్తీక్ సుబ్బరాజ్ కు స్టార్ హీరోలు అవకాశం ఇచ్చేందుకు వెనుకాముందు ఆలోచిస్తున్నారు. దాదాపు ఏడాదిగా స్టార్ హీరోల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండడంతో కాస్త గ్యాప్ తీసుకుని తన 10వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘డోరతి‘ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్న ఈ కథను ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపారు.

ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సనంత్, రిషి కాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాకు సంగీత బ్రహ్మ ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో కలసి పనిచేయడం తన కల నిజమైనట్లే అని కార్తీక్ సుబ్బరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘డోరతి’ చిత్రం వరల్డ్ ప్రిమియర్‌గా ఎంపికైంది. ఈ విశేషంతో పాటు, సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu