Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..

Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..

NTV Telugu 3 weeks ago

ఫ్లాప్ హీరోయిన్స్‌కు దుల్కర్ సల్మాన్ ఛాన్సులిస్తున్నాడు. తమకు సక్సెస్ ఇచ్చే లక్కీ భాస్కరుడు ఇతడేనని ఆ ఫెయిల్యూర్ భామలు నమ్ముతున్నారు. టాలీవుడ్‌కు దూరమైన ఆ బ్యూటీకి సాలిడ్ హిట్ ఇచ్చే బాధ్యత డీక్యూపైనే ఉంది.

దుల్కర్ సల్మాన్‌ను లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు ప్లాప్ బ్యూటీలు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు డిక్యూపైనే భారం మోపారు. టాలీవుడ్‌పై అలిగిన పూజా హెగ్డే హెగ్డే అన్నీ ఇండస్ట్రీల్లో చక్కర్లు కొట్టి ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు అలక పాన్పు దిగి తెలుగులోకి రిటర్న్ తీసుకోబోతుంది. డిసెంబర్ బరిలోదిగుతోంది శ్రీశ్రీ. పూజా టాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగుమం చేసిన దుల్కర్.. ఆమె ప్లాప్ పరంపరకు అడ్డుకట్ట వేస్తాడేమో చూడాలి.

మిక్స్ డ్ రివ్యూ తెచ్చుకున్న కూలీతో హిట్టు కొట్టానో, ప్లాప్ చూశానో అర్థం కాక సతమతమౌతున్న శృతి హాసన్ కూడా దుల్కర్‌నే నమ్ముకుంది. ఆకాశంలో ఓ తారలో కీ రోల్ ప్లే చేస్తుంది. సలార్ తర్వాత డెకాయిట్ అనవసరంగా వదులుకున్న శృతి పెద్దిలో స్పెషల్ సాంగ్‌లో కనిపించినా నో యూజ్. నెక్ట్స్ శృతి నుండి వస్తోన్న తెలుగు ఫిల్మ్ ఇదే. డ్రాగన్ పేరుతో ఆఫర్స్ కొల్లగొడుతోంది కానీ మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేకపోతుంది కయాద్ లోహార్. ఫంకీ, పల్లిచట్టంబి నిరాశ పరచగా ఇదయం మురళి విజయం అందించింది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్‌తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోంది. ఓనమ్ పండుగకు రిలీజౌతున్న ఈ పాన్ ఇండియా మూవీ. మరీ ఈ ముగ్గురు భామల్లో దుల్కర్ ఎవరికీ లక్కీ భాస్కర్ అవుతాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu