Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!

Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!

NTV Telugu 1 week ago

“తుఫానులా దూసుకువచ్చే వాడినే ‘ధురంధర్’ అంటారు”.. ఈ ఒక్క డైలాగ్ చాలు రాబోయే యాక్షన్ సునామీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఊహించుకోవడానికి!

ఎవరూ ఊహించని సరికొత్త అవతారంలో, మునుపెన్నడూ చూడని పచ్చి నెత్తురు లాంటి ‘రా అండ్ రస్టిక్’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు క్రేజీ మూవీ ‘ధురంధర్: ద రివెంజ్’ సిద్ధమైంది. సినిమా రిలీజ్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు డిజిటల్ వేదికగా ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడానికి సిద్ధమైంది.

సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు పెద్ద స్టార్స్ కనిపిస్తేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, యాక్షన్ కింగ్ సంజయ్ దత్, మ్యాచో మ్యాన్ అర్జున్ రాంపాల్, వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్, అలాగే టాలెంటెడ్ నటుడు అక్షయ్ ఖన్నా లాంటి హేమాహేమీలు ఈ సినిమాలో ఒకేసారి కనిపించనున్నారు. వీరికి తోడుగా యువ నటి సారా అర్జున్ కూడా ఒక కీలక పాత్రలో మెరవనుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మర్లందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో పాటు వేల కోట్ల కలెక్షన్లు ఈ రివెంజ్ డ్రామాపై అంచనాలు పెంచాయి. దర్శకుడు ఆదిత్య ధర్ సృష్టించిన ఈ యాక్షన్ ప్రపంచాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్, టీ-సిరీస్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఫీస్ట్‌ను ముస్తాబు చేశారు. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ‘ధురంధర్: ద రివెంజ్’ గ్రాండ్ డిజిటల్ ప్రీమియర్ జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు అట్టహాసంగా జరగనుంది. ఆ తర్వాతి రోజు అనగా, జూన్ 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘జియో హాట్‌స్టార్’లో ఈ చిత్రం ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. స్టార్ గోల్డ్ ఇండియా భాగస్వామ్యంతో వస్తున్న ఈ సినిమా.. ఓటీటీ వేదికగా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu