హోమ్
ఈ కాంబో చూసే భాగ్యం ఉందా?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేయాలని పరితపిస్తున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమాను త్వరగా పూర్తిచేసేందుకు బీజీ షెడ్యూల్‌తో కష్ట పడుతున్నాడు. లూసిఫర్ రీమేక్‌కు సన్నద్దం అవుతుండగా మరోవైపు వేదాళం పట్టాలు ఎక్కేందుకు ఎప్పుడెప్పుడా అన్నట్టు ఉంది. అయితే ఈ మూడు సినిమాలు కాకుండా చిరు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా స్టార్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటే దానికి ఎదురులేదని, కచ్చితంగా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుందని అభిమానులు అపార నమ్మకంతో ఉన్నారు. ఆ మధ్య ఈ కాంబో గురించి ప్రచారం తారా స్థాయిలో జరగిందనడంలో సందేహం లేదు.
త్రివిక్రమ్ కొన్నాళ్ల ముందే చిరంజీవికోసం ప్రత్యేకమైన కథ సిద్దం చేశాడని.. ప్రస్తుతం వీరిద్దరు ఓప్పుకున్న సినిమాలు పూర్తయ్యాక వీరి కాంబో మొదలవుతుందని వార్తలు వచ్చాయి. ఆతరువాత మళ్లీ ఈ కాంబో గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడింది లేదు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు అభిమానుల గుండెల్లో రేకెత్తాయి.
సినీ వర్గాల వారికి దీనిపై ఒక స్పష్టత లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ తన తరువాతి సినిమాను ఎన్టీఆర్‌తో చేయనున్నాడు. దాని తరువాత రామ్‌తో మరో సినిమా వచ్చే అవకాశం ఉంది. మరో వైపు మహేష్ కూడా ఈయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందా.. రాదా.. అనేది అభిమానులకు ప్రశ్నార్థకాన్ని మిగులుస్తోంది. మరేం జరుగుతుందో చూడాల్సిందే.