Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా 'ఇ.ఎం.ఐ' టెన్షన్

EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా 'ఇ.ఎం.ఐ' టెన్షన్

NTV Telugu 1 week ago

నేటి కాలంలో బైక్, కారు, ఖరీదైన స్మార్ట్ ఫోన్.. ఇలా ఏది కొన్నా ఈఎంఐ (EMI) కట్టాల్సిందే. మధ్యతరగతి యువత ఈ ఈఎంఐల ఊబిలో చిక్కుకుని ఎలాంటి అవస్థలు పడుతున్నారు?

నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? అనే అత్యంత ఆసక్తికరమైన, వాస్తవిక అంశంతో టాలీవుడ్‌లో ఓ సంచలన చిత్రం తెరకెక్కబోతోంది. అదే “ఇ.ఎం.ఐ” (E.M.I). ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సరికొత్త మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మధ్యతరగతి ఇళ్లల్లో ప్రతి నెలా ఈఎంఐలు కట్టేందుకు పడే కష్టాలను, అందులోని సున్నితమైన ఎమోషన్స్‌ను కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా మలిచి ప్రేక్షకులకు అందించబోతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ దర్శకుడు సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ నూతన దర్శకుడు నిఖిల్ కువ్వరపుకు స్క్రిప్ట్‌ను అందజేశారు.

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ సినిమాలో ఫ్రెష్ ఫేసెస్‌ను పరిచయం చేస్తున్నారు. ‘లాల్ సలామ్’, ‘హాస్టల్ డేస్’ లాంటి వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దరహాస్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన శైలజ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఉండబోతోందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ.. ఈ సినిమాతో పాటు ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని సైతం నిర్మించబోతోంది. దానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ ‘ఇ.ఎం.ఐ’ చిత్రానికి సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాంకేతిక నిపుణుల పరంగా ఫహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మాధవ్ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీధర్ సొంపల్లి ఎడిటర్‌గా, సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu