Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Emmanuel Macron: నటి మెసేజ్‌లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు భార్య చెంపదెబ్బ!

Emmanuel Macron: నటి మెసేజ్‌లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు భార్య చెంపదెబ్బ!

NTV Telugu 1 week ago

Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌ను ఆయన భార్య బ్రిగిట్టే మక్రాన్ చెంపదెబ్బ కొట్టడం వైరల్ అయిన విషయం అంతా తెలిసిందే.

గత ఏడాది ఈ జంట వియత్నాం పర్యటన వెళ్లిన సందర్భంలో ఫ్లైట్‌లోనే ఇద్దరు గొడవ పడిని వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఇద్దరూ కూడా దీనిని ఖండించారు. ఇద్దరి మధ్య సరదాగా సన్నివేశం జరిగినట్లు వివరణ ఇచ్చుకున్నారు.

Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్

ఇదిలా ఉంటే, ఈ ''చెంపదెబ్బ'' వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇరాన్‌లో జన్మించిన నటి గోల్షిఫ్తే ఫరాహానీతో ఫ్రెంచ్ అధ్యక్షుడు సరసమైన మెసేజ్‌లు చూసిన తర్వాత బ్రిగిట్టే, మక్రాన్‌ను కొట్టిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరియన్ టార్డిఫ్ రాసిన "యాన్ (ఆల్మోస్ట్) పర్ఫెక్ట్ కపుల్" అనే కొత్త పుస్తకంలో ఈ ఆరోపణలు చేశారు. ఈ పుస్తకంలో 48 ఏళ్ల మక్రాన్, 42 ఏళ్ల ఫరాహానీతో కొన్ని నెలలుగా ''ప్లాటోనిక్ రిలేషన్‌షిప్'' ఉన్నట్లు టార్డిఫ్ ఆరోపించారు.

బుధవారం ఆయన రచించిన బుక్ అమ్మకానికి వచ్చింది. ఫ్రెంచ్ అధ్యక్షుడి ఫోన్‌లో ఇరాన్-ఫ్రెంచ్ నటికి పంపించిన రొమాంటిక్ మెసేజ్‌లు చూసిన తర్వాతే 73 ఏళ్ల బ్రిగిట్టే కోపంతో చేయిజేసుకున్నట్లు ఉంది. ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తన కన్నా పెద్దదైన, తన టీచర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది మే నెలలో వియత్నాం పర్యటన సమయంలో హనోయ్‌లో మక్రాన్, బ్రిగిట్టే విమానం దిగే ముందు అతడి ఫోన్‌లో ఫరాహానీ పంపిన ఒక మేసేజ్‌ను చదివింది. దీంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినట్లు టార్డిప్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu