Dailyhunt
ఏపీ అడ్వకేట్ జనరల్ తో జగన్ సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ !

ఏపీ అడ్వకేట్ జనరల్ తో జగన్ సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ !

NTV Telugu 5 years ago

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో అడ్వకేట్ జనరల్ భేటీ అయ్యారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఈ సమావేశం కీలకంగా మారింది. ఇదే సమావేశానికి మంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా హాజరైనట్లు చెబుతున్నారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఎన్నికల సంఘం.ఈ క్రమంలోనే నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వమించే దిశగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది ఎస్‌ఈసీ. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన ఎస్‌ఈసీ.. తిరుపతి అర్బన్‌ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మంచిర్యాల, పుంగనూర్‌, రాయదుర్గం, తాడిపత్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తప్పించాల్సిందిగా సూచించింది.

గత ఏడాది మార్చిలో ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. గతంలో విధులు సరిగా నిర్వర్తించని అధికారులపై చర్యలకు సూచించింది ఎస్‌ఈసీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu