ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టెన్షన్ నెలకొన్నది. అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. ప్రచారం నిర్వహించుకుంటున్నాయి. ఈనెల 10 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. 14 వ తేదీన రిజల్ట్ ఉంటాయి. ఇటీవలే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసాయి. కొన్ని గ్రామ పంచాయతీలు మినహాయించి అన్ని పంచాయతీల్లో ఎన్నికలు సజావుగా ముగిసిన సంగతి తెలిసిందే. ఏ గ్రామపంచాయతీల్లో అయితే ఎన్నికలు జరగలేదో ఆ గ్రామ పంచాయతీల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 372 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 6 సాయంత్రం 5 గంటల వరకు పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు గడువు ఉన్నది.

