Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..

Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..

NTV Telugu 3 days ago

Fauzi Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, మేకర్స్ కూడా చిత్రీకరణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఏకకాలంలో రెండు యూనిట్లు పని చేస్తున్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. మెయిన్ యూనిట్ హైదరాబాద్‌లోని గండిపేట పరిసరాల్లో ప్రభాస్‌తో పాటు ఇతర కీలక నటీనటులపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తోందట. కథకు కీలకమైన ఈ ఎపిసోడ్‌ను డైరెక్టర్ హను రాఘవపూడి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రెండో యూనిట్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. ఒకేసారి రెండు యూనిట్లతో షూటింగ్ నిర్వహిస్తుండటంతో సినిమా పనులు వేగంగా పూర్తవుతున్నాయని సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న వేగాన్ని చూస్తుంటే, ముందుగా ప్రకటించినట్లే డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. భారీ నిర్మాణ విలువలు, హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై రోజురోజుకూ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu